Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘స్నికర్స్‌’ పేరుకు ఓ గుర్రంతో లింక్‌.. చాక్లెట్‌ పేరు వెనుక ఆసక్తికర కథ

Snickers name linked to a horse and the interesting story behind the brand
Advertisement
  • స్నికర్స్‌ చాక్లెట్‌ పేరుకు ఓ గుర్రంతో ఆసక్తికరమైన సంబంధం
  • మార్స్‌ కుటుంబం పెంచిన రేసు గుర్రం పేరు ‘స్నికర్స్‌’
  • రేసుల్లో విజేతగా నిలిచిన గుర్రం
  • చాక్లెట్‌ విడుదలకు నెల రోజుల ముందే చనిపోయిన గుర్రం
  • దాని జ్ఞాపకార్థం చాక్లెట్‌కు ‘స్నికర్స్‌’ పేరు
Advertisement
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన చాక్లెట్‌ బార్‌ స్నికర్స్‌ పేరుకు ఓ గుర్రంతో సంబంధం ఉంది. స్నికర్స్‌ తయారీ సంస్థ మార్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తొలి స్నికర్స్‌ బార్‌ను 1930లో అమెరికాలోని షికాగోలో తయారు చేశారు. కంపెనీ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన గుర్రం పేరును ఈ చాక్లెట్‌కు పెట్టారు.

మార్స్‌ కుటుంబం చాక్లెట్‌ వ్యాపారంలో విజయవంతమైన తర్వాత 3,000 ఎకరాల గుర్రాల పెంపకం ఫారాన్ని కొనుగోలు చేసింది. ఆ ఫారంలో పెంచిన రేసు గుర్రాల్లో స్నికర్స్‌ కూడా ఒకటి. అది రేసుల్లో విజేతగా నిలిచింది. అయితే కొత్త చాక్లెట్‌ బార్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి నెల రోజుల ముందే ఆ గుర్రం చనిపోయింది. దీంతో దాని జ్ఞాపకార్థం చాక్లెట్‌కు ‘స్నికర్స్‌’ అని పేరు పెట్టారు.

మిల్క్‌ చాక్లెట్‌, కారమెల్‌, నౌగట్‌, వేరుశనగల కలయికతో రూపొందించిన ఈ బార్‌ను తొలిసారి కేవలం ఐదు సెంట్లకు విక్రయించారు. అనంతరం ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

అయితే బ్రిటన్‌లో మాత్రం తొలుత ‘స్నికర్స్‌’ పేరుతో కాకుండా ‘మారథాన్‌ బార్‌’ పేరుతో విక్రయించారు. ‘స్నికర్స్‌’ అనే పేరు అక్కడి ‘నికర్స్‌’ అనే పదానికి దగ్గరగా ఉండటంతో వివాదం తలెత్తవచ్చని భావించి ఈ మార్పు చేశారు. కొంతకాలం తర్వాత మళ్లీ అసలు పేరైన స్నికర్స్‌నే కొనసాగించారు.

కాలక్రమంలో స్నికర్స్‌ ఫన్‌ సైజ్‌, ఐస్‌క్రీమ్‌ బార్‌, ఆల్మండ్‌, పీనట్‌ బటర్‌, పెకాన్‌ తదితర అనేక వేరియంట్లను తీసుకొచ్చింది. 2010లో “యూ ఆర్‌ నాట్‌ యూ వెన్‌ యూ ఆర్‌ హంగ్రీ” అనే ప్రకటనల ప్రచారం తర్వాత బ్రాండ్‌కు మరింత ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది.
Advertisement
Advertisement
Snickers
Mars family
Chocolate bar history
Snickers horse name
Marathon bar UK
Snickers ingredients

More Telugu News